అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన తాజా సంఘర్షణలో అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు శాటిలైట్ చిత్రాల ఆధారంగా అంచనా వేశాయి. ఇరాన్ సుమారు 20
అమెరికా సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిందని, ఇది ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలోని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లోని
అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రేడార్లు ధ్వంసం అయ్యాయి.