అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) తమ డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్లతో దాడి జరిగినట్లు ధ్రువీకరించింది. ఈ దాడులు UAEలోని రెండు సెంటర్లపై నేరుగా, బహ్రెయిన్‌లోని మరో సెంటర్ సమీపంలో జరిగాయి. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగి భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. టెక్ ప్రపంచంలో ఈ దాడి తీవ్ర కలకలం రేపుతోంది.