ఇరాన్‌ వద్ద 11 అణు బాంబులకు సరిపడా యురేనియం నిల్వలు

48చూసినవారు
ఇరాన్‌ వద్ద 11 అణు బాంబులకు సరిపడా యురేనియం నిల్వలు
ఇరాన్‌ వద్ద 11 అణు బాంబులకు సరిపడా యురేనియం నిల్వలు ఉన్నట్లు అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌ వెల్లడించారు. ఇరాన్ చర్చల బృందమే ఈ విషయాన్ని గర్వంగా వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన సుమారు 460 కిలోల యురేనియం నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారాయి. ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్