డీల్ కోసం ఇరాన్ ప్రయత్నిస్తోంది: వైట్ హౌస్ (వీడియో)

11చూసినవారు
అమెరికాతో కొత్త ఒప్పందం (డీల్) కుదుర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అమెరికా సైనిక దాడులతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతినడంతో చర్చలకు ఆసక్తి చూపుతోందని ఆమె పేర్కొన్నారు. అలాగే హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసి అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఇరాన్ తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై అమెరికా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వైట్ హౌస్ తెలిపింది.

సంబంధిత పోస్ట్