ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ.. చమురు ధరలు $150కు చేరే ప్రమాదం

15చూసినవారు
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ.. చమురు ధరలు $150కు చేరే ప్రమాదం
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ గల్ఫ్ ప్రాంతంలో చమురు ఉత్పత్తి, రవాణాను దెబ్బతీసి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు $120-$150 దాటే అవకాశం ఉంది. 88% చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు ఇది పెద్ద దెబ్బ. పెరిగిన ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (CAD) పెరుగుతుంది. విమానయాన, రవాణా, రసాయన, ఎరువుల పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొంటే, లక్షలాది మంది భారతీయుల భద్రత ప్రశ్నార్థకం అవుతుంది, ఇది వారు స్వదేశానికి పంపే సుమారు $50 బిలియన్ల ఆదాయంపై ప్రభావం చూపుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్