
చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశం?
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 10%కుపైగా తగ్గిన యూఎస్ క్రూడ్ ఇప్పుడు కోలుకొని -4% వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధరల తగ్గుదల కూడా తటస్థంగా ఉంది. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేస్తామని హెచ్చరించడం, యూఏఈలోని అబుదాబి ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనితో చమురు ధరలు మళ్లీ పెరిగి, భారత్‌లో ఆందోళన మొదలైంది.




