ఇరాన్ తాజాగా ఫట్టా–2 హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రకటించింది. ఈ క్షిపణిని 2023 నవంబర్‌లో ఇస్లామిక్ రివల్యూషన్రీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆవిష్కరించింది. ఫట్టా–2 హైపర్సోనిక్ క్షిపణి మాక్ వేగంగా దూసుకెళ్లగలదు. సుమారు 1,500 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను తాకే సామర్థ్యం కలిగి ఉంది. దాదాపు 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉందని ఇరాన్ వెల్లడించింది.