ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, నాటో దేశమైన తుర్కియేపై ఇరాన్ క్షిపణిని ప్రయోగించింది. నాటో ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఈ క్షిపణిని ధ్వంసం చేసిందని తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ఏదైనా తీవ్రంగా పరిణమిస్తే ప్రతిస్పందించే సత్తా తమకు ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.