అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ధ్రువీకరించింది. ఈ దాడుల కారణంగా అణు కేంద్రం ప్రాంగణంలోని ప్రవేశ భవనాలు దెబ్బతిన్నాయని, అయితే రేడియేషన్ లీకేజీ ఉండకపోవచ్చని ఐఏఈఏ తెలిపింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని సంస్థ నిర్ధారించింది.