
యుద్ధరంగంలోకి లెబనాన్.. ఇరాన్ ప్రతీకారంతో మూడో ప్రపంచ యుద్ధ భయం
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత, హెజ్బొల్లా, హౌతీలు ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించడంతో లెబనాన్ యుద్ధరంగంలోకి దిగింది. ఇది ఖమేనీ హత్యకు ప్రతీకారంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బైరూత్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఎదురుదాడి చేపట్టింది. 1982లో ఇరాన్ మద్దతుతో ఏర్పడిన హెజ్బొల్లా, గతంలోనూ ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. అమెరికాకు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.




