
యుద్ధం వల్ల కుప్పకూలుతోన్న ఆరోగ్య వ్యవస్థ!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తోంది. ఆస్పత్రులపై దాడులు, మందుల కొరత, వైద్య సిబ్బంది మరణాలు, శరణార్థ శిబిరాల్లో పెరుగుతున్న వ్యాధులతో పరిస్థితి భయంకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇరాన్లో 1300 మందికి పైగా మరణించగా, లెబనాన్లో 570 మంది మరణించారు. ఫిబ్రవరి 28 తర్వాత ఇరాన్లో 18, లెబనాన్లో 25 ఆరోగ్య కేంద్రాలపై దాడులు జరిగాయి. లెబనాన్లో 49 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 ఆస్పత్రులు పనిచేయడం లేదు. గాజాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.




