ఖమేనీ అంత్యక్రియలపై ఇరాన్ ప్రకటన

52చూసినవారు
ఖమేనీ అంత్యక్రియలపై ఇరాన్ ప్రకటన
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల నిర్వహణపై ఇరాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం, భద్రతా కారణాలు, భారీ జనసందోహం నేపథ్యంలో ఈ ప్రక్రియ పలుమార్లు వాయిదా పడింది. తాజాగా, ఇరాన్ అధికారిక స్టేట్ మీడియా ప్రకారం, ఖమేనీ 'గ్రాండ్ ఫ్యూనరల్' కోసం ప్రభుత్వం ప్రత్యేక హెడ్‌క్వార్టర్స్‌ను ఏర్పాటు చేసింది.