
భార్యను హత్య చేసి, సిమెంట్ తో కప్పి దాచిన భర్త
గుజరాత్‌లోని దారుణం చోటుచేసుకుంది. సూరత్‌లో భార్య శిల్పా సాళ్వే (39) ను హత్య చేసి, మృతదేహాన్ని పాడుబడిన ఇంట్లోని పెట్టెలో సిమెంట్ తో కప్పి దాచిన భర్త విశాల్ సాళ్వే (40) ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన విశాల్, తన కొడుకుకు దొరికినన లేఖ ద్వారా హత్య కేసుగా మారింది. వివాహేతర సంబంధం అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.




