పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రతిపాదించిన రోడ్‌మ్యాప్‌ను
అమెరికా తిరస్కరించింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, అవసరమైతే భయానక యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈసారి యుద్ధం మొదలైతే ఊహించని స్థాయిలో భీకరంగా మారొచ్చని హెచ్చరించారు. అయితే, దౌత్యానికి తలుపులు మూసివేయలేదని ఆయన తెలిపారు. మరోవైపు,
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో ఇరాన్‌తో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.