ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్ధృతమయ్యాయి. నిరసనకారుల అణచివేతకు ఇంటర్నెట్, విద్యుత్ నిలిపివేసినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. రెండు వారాల్లో ఘర్షణల్లో 65 మందికిపైగా మృతిచెందారు. ఇరాన్ పాలకులు మరణశిక్ష హెచ్చరికలు జారీ చేసినా లెక్కచేయకుండా టెహ్రాన్ వీధుల్లో ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేస్తూ, టెహ్రాన్ వీధుల్లో భీకరమైన పోరాటం చేస్తున్నారు.