తమపై అమెరికా విధించిన ఆంక్షలకు మద్దతు ఇస్తున్న దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఆయా దేశాల నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు అంతరాయాలను ఎదుర్కోక తప్పదని తెలిపింది. యుద్ధంలో శత్రువు యొక్క లక్ష్యాలు ఏవీ నెరవేరలేదని, ఇరాన్ రాజకీయ సమతుల్యతకు కూడా ఎటువంటి భంగం కలగలేదని పేర్కొంది. తమను అడ్డుకోవడంలో అమెరికా విఫలమైందని, అందుకే కాల్పుల విరమణకు అంగీకరించిందని ఇరాన్ ఎద్దేవా చేసింది.