ట్రంప్ పై ఇరాన్ మంత్రి తీవ్ర ఆరోపణలు

0చూసినవారు
ట్రంప్ పై ఇరాన్ మంత్రి తీవ్ర ఆరోపణలు
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర‌గాచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఆవేశంతో బాంబు దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడికి ముందు అమెరికా ప్రతినిధులతో ఇరాన్ చర్చలు నిర్వహించినా, అవి కొలిక్కి రాకముందే ట్రంప్ సహనాన్ని కోల్పోయి దాడులకు పాల్పడినట్లు అర‌గాచి ఆరోపించారు. సంక్లిష్టమైన అణు కేంద్రాలపై చర్చలు జరుగుతున్న వేళ, ఆ సంప్రదింపులను ట్రంప్ ఒక రియల్ ఎస్టేట్ లావాదేవీలా చూశారని, వాస్తవాలను అబద్ధపు మేఘాలు కమ్ముకుంటే అంచనాలు చేరుకోవడం వీలుకాదని మంత్రి తన పోస్టులో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్