ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కోనసీమలోని ప్రముఖ ఆలయాలు అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 5, 2025న అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీ వివరాలను ఐఆర్సీటీసీ https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో చూడవచ్చు. లింగంపల్లి నుంచి ట్రైన్ సెప్టెంబర్ 5న రాత్రి 08.30 గంటలకు, సికింద్రాబాద్ నుంచి అయితే రాత్రి 9.15 గంటలకు బయల్దేరుతుంది.