ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ 'బీటా వెర్షన్' లాంచ్

12053చూసినవారు
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ 'బీటా వెర్షన్' లాంచ్
భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో కూడిన కొత్త వెబ్‌సైట్ ‘బీటా వెర్షన్’ను ప్రజల వినియోగం కోసం అధికారికంగా ప్రారంభించింది. జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) విద్యార్థుల సూచనల ఆధారంగా ఈ వెబ్‌సైట్‌లో కీలక మార్పులు చేశారు. క్లీన్ ఇంటర్‌ఫేస్, ఒకే స్క్రీన్‌పై సీట్ల లభ్యత, మెరుపు వేగంతో టికెట్ బుకింగ్, సులభమైన రీ-బుకింగ్, ఈజీగా ప్లాట్‌ఫామ్ టికెట్ పొందడం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. రాబోయే కొద్ది వారాల్లో పూర్తిస్థాయి పోర్టల్ అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్