
నిద్రలోనే ప్రసవించిన మహిళ
కెనడాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కరోలినా అనే మహిళ నిద్రలోనే ప్రసవించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు నొప్పులు రావడానికి డాక్టర్లు మందులు వేశారు. ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అనస్థీషియా ఇచ్చారు. దాంతో నిద్రలోకి జారుకున్నా. కడుపులో చలనం లేదని నర్స్ చెప్పడంతో భయపడిపోయా. తీరా కాళ్ల దగ్గర చిన్నారి సైలెంట్‌గా బోర్లా పడుకున్నాడు. నర్సు ఎత్తుకుని నిమిరితే ఏడ్చాడు’ అని కరోలినా చెప్పారు.




