వాహన బీమాలో ఐఆర్‌డీఏఐ మార్పులు.. డీలర్ల కమిషన్ రద్దు

8చూసినవారు
వాహన బీమాలో ఐఆర్‌డీఏఐ మార్పులు.. డీలర్ల కమిషన్ రద్దు
కొత్త వాహనాల మోటార్ ఇన్సూరెన్స్ విక్రయ విధానంలో ఐఆర్‌డీఏఐ (IRDAI) కీలక ప్రతిపాదనలు చేసింది. షోరూమ్‌లలో క్యూఆర్ కోడ్‌ల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఇన్సూరెన్స్ ఎంచుకునే సౌకర్యం, థర్డ్ పార్టీ బీమాపై డీలర్ల కమిషన్ రద్దు, ఓన్ డ్యామేజ్‌పై గరిష్ఠంగా 5% పరిమితి విధించనుంది. వినియోగదారులు బయట ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినా క్యాష్‌లెస్ రిపేర్ సదుపాయాన్ని నిరాకరించకూడదని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. ఈ మార్పులు వాహన బీమా రంగంలో గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.

సంబంధిత పోస్ట్