
బ్రిక్స్ సదస్సుతో ఢిల్లీ హోటళ్లకు డిమాండ్.. ఆకాశాన్నంటుతున్న ధరలు
సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న 18వ BRICS శిఖరాగ్ర సదస్సుతో దేశ రాజధానిలో హోటళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వివిధ దేశాల నేతలు, ప్రతినిధులు రానుండటంతో ఫైవ్ స్టార్ హోటళ్లు దాదాపు నిండిపోయాయి. సాధారణంగా రూ.18 వేలుగా ఉండే సూట్ గదుల అద్దె.. సదస్సు సమయంలో రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షలకు పెరిగింది. ఫైవ్ స్టార్ హోటళ్ల సెర్చ్‌లు 50% పెరగగా, బుకింగ్‌లలో 25-138% వార్షిక వృద్ధి నమోదైంది. 4-స్టార్, బడ్జెట్ హోటళ్లపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది.




