
పోలీసుల ఆంక్షలు దాటి జంతర్ మంతర్ చేరిన నిరసనకారులు (VIDEO)
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ నేహా బోరా పిలుపుతో భారీ నిరసనలు చెలరేగాయి. పోలీసులు విధించిన ఆంక్షలను దాటుకొని యువత, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు యువతను అడ్డుకొని అరెస్ట్ చేయగా.. వాహనాలను అడ్డుకొని సాధారణ ప్రజలు వారిని విడిపించారు. దీంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.




