క్షమాపణ చెప్తే సరిపోతుందా?: YS జగన్ ఫైర్

3975చూసినవారు
క్షమాపణ చెప్తే సరిపోతుందా?: YS జగన్ ఫైర్
AP: తిరుమల తొక్కిసలాట ఘటనపై వైసీపీ అధినేత YS జగన్ మరోసారి స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన TTD ఛైర్మన్, ఈవో, JEO, కలెక్టర్, SPలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారిపై కేసులు పెట్టి దేవునిపై ఉన్న భక్తిని సీఎం చాటుకోవాలన్నారు. 'డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలంటున్నారు. ఆరుగురు చనిపోతే ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందా? సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయ డ్రామాలు ఆపేయాలి' అని సంచలన ట్వీట్ చేశారు.