ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Mar 15, 2026, 06:03 IST/

ఇరాన్ 'మిస్సైల్ సిటీ' భీకర దృశ్యాలు: అమెరికాకు పెను సవాలు

Mar 15, 2026, 06:03 IST
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇరాన్ తన భూగర్భ ‘మిస్సైల్ సిటీ’ దృశ్యాలను విడుదల చేసింది. కొండల కింద కిలోమీటర్ల మేర విస్తరించిన రహస్య బంకర్లలో వందలాది క్షిపణులు, సూసైడ్ డ్రోన్లు, సముద్ర మందుపాతరలు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ టీవీ వెల్లడించింది. శత్రు ఉపగ్రహాలు, గగనతల దాడులకు చిక్కకుండా వీటిని భద్రపరిచారు. సముద్రంపై, నీటిలో వేగంగా దూసుకెళ్లి నౌకలను ఢీకొని పేలే డ్రోన్ బోట్లు ప్రత్యేకంగా ప్రమాదకరమని చెబుతున్నారు. యూనైటైడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ దాడుల తర్వాత కూడా తమ ఆయుధ శక్తి తగ్గలేదని చూపించేందుకే ఈ వీడియోలు విడుదలైనట్లు విశ్లేషకులు అంటున్నారు.