స్పేస్ వార్‌కు భారత్ సిద్ధమేనా?

4638చూసినవారు
స్పేస్ వార్‌కు భారత్ సిద్ధమేనా?
అంతరిక్షంలో ఆయుధాలను మోహరించామని అమెరికా ప్రకటించడంతో స్పేస్‌ వార్‌పై చర్చ మొదలైంది. అమెరికా, చైనా, రష్యా ఇప్పటికే యాంటీ శాటిలైట్‌ (ఏశాట్‌) పరీక్షలు నిర్వహించాయి. భారత్‌ కూడా 2019లో ‘మిషన్‌ శక్తి’ ద్వారా లో ఎర్త్‌ ఆర్బిట్‌లోని మైక్రోశాట్‌-ఆర్‌ ఉపగ్రహాన్ని కూల్చి ఏశాట్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దీంతో అమెరికా, చైనా, రష్యా తర్వాత ఈ సత్తా చూపిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. అయితే అంతరిక్షంలో ఆయుధాలను మోహరించే ప్రయత్నాలు భారత్‌ చేస్తున్నట్లు ఇప్పటివరకు ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్