ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా?

444చూసినవారు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా?
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఆయన ఎక్స్‌లో యుద్ధంపై మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో నెతన్యాహు కుడిచేతికి ఆరు వేళ్లు కనిపించడంతో.. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించిన వీడియో అని కొందరు ఆరోపిస్తున్నారు. శత్రుదేశాలకు సమాచారం తెలియకుండా ఉండేందుకు నెతన్యాహు ఏఐ వీడియోను విడుదల చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్