TG: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ జిల్లాలో గురువారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే శుక్రవారం కూడా స్కూళ్లకు సెలవు ఉంటుందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తెలంగాణలోని వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎక్కడ చూసిన వర్షపు నీరు ఉండడంతో నేడు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి.