పిల్లలను కనకపోతే క్రూరత్వమా?: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

2చూసినవారు
పిల్లలను కనకపోతే క్రూరత్వమా?: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సంతానం లేకపోవడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం ఉద్దేశం పిల్లలను కనడం మాత్రమే కాదని పేర్కొంది. సంతానం లేనంత మాత్రాన భార్య లేదా భర్త వైవాహిక బంధంలో విఫలమైనట్లు కాదని తెలిపింది. భార్య క్రూరత్వం కారణంగా సంతానం కలగలేదని.. తనకు విడాకులు ఇవ్వాలంటూ ఓ భర్త వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. గర్భాశయ ఫైబ్రాయిడ్లకు చికిత్స తీసుకున్న భార్య.. బిడ్డను కనాలనే ఆశతో బాధాకరమైన చికిత్సను కూడా భరించిందని, ఆమె ప్రవర్తనను ఏ విధంగానూ వివాహాన్ని తిరస్కరించినట్లుగా గానీ, భర్త పట్ల క్రూరత్వంగా గానీ పరిగణించలేమని కోర్టు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్