
మహిళల హాస్టల్ బాత్రూమ్లలో స్పై కెమెరాలు..!
తమిళనాడులోని హోసూర్ సమీపంలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమ హాస్టల్ బాత్రూమ్లలో రహస్య కెమెరాలు అమర్చినట్లు గుర్తించారు. ఒడిశాకు చెందిన నీలుకుమారి అనే కార్మికురాలు ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో, దాదాపు 2,000 మందికి పైగా మహిళా కార్మికులు రాత్రంతా నిరసన తెలిపారు. ఈ కెమెరాలను ఒక మహిళ అమర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హాస్టల్ మేనేజ్మెంట్పై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.




