
డిసెంబర్ 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్
రవాణా వాహనాలకు ఫిట్నెస్ చార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (SIMTA) నిర్ణయించింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది. AP, TN, TG, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది.




