ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


మామిడి పండ్లు తింటున్నారా ! అయితే ఇది మీకోసమే !
May 05, 2026, 07:05 IST/

మామిడి పండ్లు తింటున్నారా ! అయితే ఇది మీకోసమే !

May 05, 2026, 07:05 IST
మామిడి పండ్లను తినే ముందు అరగంట పాటు నీటిలో నానబెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పండ్లలోని ఫైటిక్ యాసిడ్ తగ్గి, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాల శోషణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా, శరీరంలో అధిక వేడి, ఆమ్లత్వం, ఉబ్బరం తగ్గుతాయి. పండ్లపై ఉండే పురుగుమందులు, రసాయన అవశేషాలు తొలగిపోతాయి. కాడ దగ్గర ఉండే అలర్జీ కలిగించే లాటెక్స్ పదార్థం కూడా తగ్గుతుంది. నానబెట్టడం వల్ల మామిడి పండ్లు మరింత రసభరితంగా మారతాయని, జీర్ణ సమస్యలు లేకుండా తినడానికి ఇది సురక్షితమైన పద్ధతి అని వైద్యులు పేర్కొన్నారు.