
లిక్కర్ కేసు.. అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
AP: లిక్కర్ కేసులో ఏ49 అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపులను సిండికేట్ సభ్యులకు బదిలీ చేయడంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులు రాజ్ కెసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అనిల్ చోక్రా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. అదానీ డిస్టిలరీస్ నుంచి రూ.18 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి రూ.20 కోట్లు, స్పై అగ్రో నుంచి రూ.39 కోట్ల వసూలు చేసినట్లు తెలిసింది.




