
24 గంటల్లో మూడు శిఖరాలు ఎక్కి.. బ్రిటన్ యువరాణి ఘనత
బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ సరికొత్త ఘనత సాధించారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆమె, ఛారిటీ కోసం కేవలం 24 గంటల్లోనే స్కాట్లాండ్లోని బెన్ నెవిస్, ఇంగ్లాండ్‌లోని స్కాఫెల్ పీక్, వేల్స్‌లోని స్కోడౌన్ అనే మూడు శిఖరాలను అధిరోహించి 'నేషనల్ త్రీ పీక్స్ ఛాలెంజ్'ను పూర్తి చేశారు. ఈ ఛాలెంజ్ ద్వారా క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. 2024 మార్చిలో క్యాన్సర్ బారిన పడిన కేట్, గతేడాది జనవరిలో కొలుకున్నారు.




