మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ ఖాయం?

16చూసినవారు
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ ఖాయం?
TG: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ తొలగింపు దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన ఆమెకు కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఇక సురేఖను మంత్రివర్గంలో కొనసాగించవద్దని సీఎం రేవంత్ అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పెద్దల నుంచి ఆమెకు సానుకూల స్పందన లభించలేదని, అందుకే సురేఖ ప్రెస్‌మీట్‌లో సీఎం, పలువురు మంత్రులపై విమర్శలు గుప్పించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డైరెక్ట్‌గా సీఎంపై విమర్శలు, మహిళా మంత్రి, తన సమాజిక వర్గం బలం వంటి అంశలు ప్రస్తావించారని టాక్.

సంబంధిత పోస్ట్