మాంసాహారమే గుండెపోటుకు కారణమా? వైద్యుల హెచ్చరిక

10829చూసినవారు
మాంసాహారమే గుండెపోటుకు కారణమా? వైద్యుల హెచ్చరిక
ఒకప్పుడు పండగలకు మాత్రమే పరిమితమైన మాంసాహారం ఇప్పుడు నిత్యం ఆహారంలో భాగమైంది. అయితే, రుచికరమైన మాంసాహారమే గుండెపోట్లు, బ్రెయిన్ స్ట్రోక్‌లకు ప్రధాన కారణమవుతోందని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మటన్ జీర్ణమైనప్పుడు విడుదలయ్యే యూరిక్ యాసిడ్, నైట్రోజనస్ వ్యర్థాలు కిడ్నీలపై భారం పెంచి, వైఫల్యానికి దారితీస్తాయి. మటన్‌లోని కొవ్వు కాలేయంలో పేరుకుపోయి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను కలిగిస్తుంది. రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి, షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం 30% పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్