నటి
సమంత కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన ఫిట్నెస్ ప్రయాణానికి సంబంధించిన వీడియోను ‘ది ఫైనల్ ల్యాప్’ అనే క్యాప్షన్‌తో
సమంత పంచుకున్నారు. దీనిపై స్పందించిన నటి కృతి కర్బందా.. ‘ముగ్గురికీ నా ప్రేమను పంపిస్తున్నా’ అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యతో సమంతకు కవల పిల్లలు పుట్టబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కృతి చేసిన వ్యాఖ్యకు అసలు ఉద్దేశం ఏమిటన్నది స్పష్టత లేదు.
సమంత కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారనే వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.