స్వదేశంలో టీమిండియాకు మరో పరాభావం తప్పేలా లేదు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల్లో భారత్ పట్టు విడిచింది. ఇటు బంతిలో, అటు బ్యాట్‌తో విఫలమైన టీమిండియా ఈ మ్యాచ్ గెలుపు ఆశలను దాదాపు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే భారత్‌ను స్వదేశంలో రెండుసార్లు వైట్‌వాష్ చేసిన జట్టుగా సౌతాఫ్రికా రికార్డు సృష్టించనుంది. అయితే ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్నందుకు టీమిండియా ఇప్పటికైనా గట్టిగా పోరాడితే మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్సుంది.