TG: టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ సమాజంలో మెజారిటీ అయిన బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులకు రెడ్ల పేర్లు పెట్టడానికి రాష్ట్రం రెడ్ల జాగీరా అని సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ఎత్తిపోతల పథకాలకు కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల పేర్లు పెడుతున్నారని విమర్శించారు. కావాలంటే సులభ్ కంప్లెక్స్‌లకు కూడా రెడ్ల పేరు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.