సీఎంకు ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందా?: కవిత

9చూసినవారు
TG: కొడంగల్ నియోజకవర్గంలో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నా.. గత సంవత్సన్నర కాలంలో తొలగించిన ఓట్లు కేవలం 808 మాత్రమేనని TRS అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. అదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో మాత్రం దాదాపు 7 వేల ఓట్లు ఎలా తొలగించారని ప్రశ్నించారు. ఈ వ్యత్యాసంతో ఎన్నికల సంఘం సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పందించి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్