పురుగు మందుల కొనుగోలులో రైతులు మోసపోకుండా ఉండటానికి, స్మార్ట్ఫోన్ ద్వారా క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేసి అసలు సరుకును గుర్తించాలని అధికారులు సూచించారు. డబ్బాపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే బ్యాచ్ నంబరు, తయారీ, గడువు తేదీల వివరాలు తెలుస్తాయి. ఈ వివరాలు డబ్బాపై ఉన్న వాటితో సరిపోలితేనే కొనాలని, లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే GST బిల్లుతో కొనుగోలు చేయాలని, సీలు, లేబుల్, గడువు తేదీలను సరిచూసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.