TG: సీఎం రేవంత్ రెడ్డి.. ఇది ప్రజా పాలనా? తెలంగాణ ద్రోహుల పాలనా? అని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'సింగరేణిలో పని చేసిన రాజశేఖర్ రెడ్డి అనే ఆంధ్ర ఉద్యోగిని తీసుకొచ్చి తెలంగాణ జెన్‌కో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు. తెలంగాణ రాదని ఉద్యమాన్ని అవమానపరిచిన కుమార్ రాజాను తరిమికొడితే.. అతడినే తెచ్చి ఉద్యోగులపై డైరెక్టర్‌గా పెట్టారు. ఇది తెలంగాణ ఉద్యమకారుల్ని, విద్యుత్ ఉద్యోగులను అవమానపరచడం కాదా?' అని ప్రశ్నించారు.