ఓలీ తర్వాత నేపాల్‌ ప్రధాని ఈయనేనా..!

12401చూసినవారు
ఓలీ తర్వాత నేపాల్‌ ప్రధాని ఈయనేనా..!
ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా.. దానికి అధ్యక్షుడి ఆమోదం లభించింది. వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చల ద్వారా ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని నిరసనకారుల్ని నేపాల్ ఆర్మీ, ఇతర భద్రతా సంస్థల చీఫ్స్‌ కోరుతున్నారు. తదుపరి ప్రధానిగా కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు వినిపిస్తోంది. ప్రజలు ఆయనను బాలెన్‌గా పిలుస్తుంటారు. ఈ నిరసనల వేళ ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓలీ స్వదేశంలోనే ఉన్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్