
ఐఐపీ లెక్కింపులో కేంద్రం మార్పులు
దేశ పారిశ్రామిక వృద్ధిని అంచనా వేసే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ లెక్కింపు పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. మారుతున్న ఆర్థిక ముఖచిత్రానికి అనుగుణంగా, మరింత పారదర్శకంగా పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా ఐఐపీ పరిధిని విస్తరిస్తున్నారు. బేస్ ఇయర్ 2011-12 స్థానంలో 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని నూతన ఆధారిత సంవత్సరంగా ఖరారు చేశారు. ఈ కొత్త సిరీస్ను జూన్ 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది.




