బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? యాక్టివేట్ చేసుకోండిలా

97చూసినవారు
బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? యాక్టివేట్ చేసుకోండిలా
కేవైసీ అసంపూర్తిగా ఉండటం, అనుమానాస్పద లావాదేవీలు, కోర్టు ఆదేశాలు వంటి పలు కారణాలతో బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. ఖాతా ఫ్రీజ్ కావడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి వెంటనే బ్యాంకును సంప్రదించాలి. కేవైసీ అప్డేట్ చేయడం లేదా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సమర్పించడం ద్వారా ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) శాఖల ఆదేశాల వల్ల ఖాతా ఫ్రీజ్ అయితే, ఆయా సంస్థల నుంచి అనుమతి లభించిన తర్వాతే ఖాతా తిరిగి పనిచేయడం ప్రారంభిస్తుంది.

సంబంధిత పోస్ట్