ఇంట్లో వంటగదిలో గ్యాస్ వాసన వస్తే నిర్లక్ష్యం చేయకండి. ఎల్‌పీజీ సిలిండర్ లీక్ అవుతోందని అనుమానం ఉంటే వెంటనే 1906 నంబర్‌కు కాల్ చేయాలి. ఇది ఎల్‌పీజీ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్. 24 గంటలు, పది భాషల్లో సేవలు అందుబాటులో ఉంటాయి. కాల్ చేసిన వెంటనే కంపెనీ సర్వీస్ ప్రతినిధి వచ్చి లీక్ చెక్ చేసి సరిచేస్తారు. అలాగే గ్యాస్ ఇన్‌స్టాలేషన్ పిరియాడిక్ తనిఖీలు మాత్రం శిక్షణ పొందిన మెకానిక్ ద్వారానే చేయించాలి. నకిలీ సిబ్బందిని నమ్మకూడదు.