SIRలో పేరు మిస్సయ్యిందా?.. ECI మరో ఛాన్స్

5చూసినవారు
SIRలో పేరు మిస్సయ్యిందా?.. ECI మరో ఛాన్స్
భారత ఎన్నికల సంఘం (ECI) దేశంలోని 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఓటరు నమోదు డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది. అర్హులైనప్పటికీ మునుపటి ఓటరు జాబితా సవరణ (SIR) సమయంలో నమోదు కానివారు, తొలిసారి అర్హత పొందిన వారిని చేర్చాలని సూచించింది. మహారాష్ట్రలో SIR ప్రక్రియ కొనసాగుతుండగా, తొందరపాటుతో ఏ ఓటరును తొలగించవద్దని, అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్