మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ పనితీరు మందగిస్తే, టెక్ నిపుణులు 'ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి' అని సలహా ఇస్తున్నారు. దీనివల్ల ఫోన్లలో పేరుకుపోయే 'డిజిటల్ చెత్త' తొలగిపోయి.. RAM క్లియర్ అవుతుంది. అనవసరమైన ప్రాసెస్‌లు ఆగిపోయి, ఫోన్ వేగంగా పనిచేయడమే కాకుండా, బ్యాటరీ లైఫ్ పెరిగి, వేడెక్కడం వంటి సమస్యలు తగ్గుతాయి. Wi-Fi, బ్లూటూత్ సమస్యలు, యాప్ క్రాష్‌లు వంటి చిన్న లోపాలు కూడా సరిపోతాయి. రెగ్యులర్‌గా రీస్టార్ట్ చేయడం వల్ల వైరస్‌లు తొలగిపోయి, సెక్యూరిటీ అప్‌డేట్స్ పూర్తవుతాయి.