
విజయ్ విజయం.. ఏపీలో వైసీపీ సంబరాలు
తమిళనాడులో విజయ్ దళపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ మంచి స్నేహితులని, ఇద్దరిదీ ఒకటే తీరు అని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తమిళనాడు ప్రజలకు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతి సుపరిపాలన అందిస్తారని నమ్మకం ఉందని తెలిపారు. విజయ్ విజయంపై ఏపీలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.




