గాజాలో బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్‌ అంగీకారం: ట్రంప్‌

57చూసినవారు
గాజాలో బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్‌ అంగీకారం: ట్రంప్‌
గాజాలో తొలిదశ బలగాల ఉపసంహరణ ప్రణాళికకు ఇజ్రాయెల్‌ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌లో ఒక ఫొటోను పోస్టు చేశారు. బలగాల ఉపసంహరణ ప్రణాళికను హమాస్‌కు పంపించినట్లు, వారు అంగీకరిస్తే కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. వెంటనే ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుందని, అనంతరం బలగాల ఉపసంహరణకు నిబంధనలు రూపొందిస్తామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్